VIDEO: తహసీల్దార్ కార్యాలయం ఎదుట యువకుల నిరాహార దీక్ష
KMR: జుక్కల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం యువకులు నిరాహార దీక్షకు దిగారు. గ్రామంలో దేవుని పేరిట వదిలిన 6 ఆవులు గత 20 రోజులుగా కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గ్రామ పెద్దలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని వారు ఆరోపించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు.