7 గంటలు ప్రయాణించి విమానం యూటర్న్
ఢిల్లీ నుంచి మాంచెస్టర్ బయల్దేరిన ఇండిగో విమానం 7 గంటల పాటు ప్రయాణించి వెనక్కి మళ్లింది. పశ్చిమాసియాలో పలు దేశాల గగనతలాలు మూసి ఉండడంతో మరో మార్గంలో ఆఫ్రికా మీదుగా ప్రయాణించి ఇథియోపియా సరిహద్దుకు చేరుకుంది. మరో నాలుగు గంటల్లో మాంచెస్టర్ చేరుకోవాల్సి ఉండగా చివరి నిమిషంలో ఇథియోపియా ప్రభుత్వం గగనతల ఆంక్షలు విధించింది. దీంతో విమానం వెనక్కి మళ్లాల్సి వచ్చింది.