కందులు అమ్మేందుకు వెళ్తుండగా రైతు మృతి

కందులు అమ్మేందుకు వెళ్తుండగా రైతు మృతి

ADB: తలమడుగు మండలం కుచులపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. కందులు విక్రయించేందుకు ఇంగన్ ఘాట్కు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు పోశెట్టి (50) మృతి చెందారు. సోమవారం ఉదయం మ్యాక్స్ వాహనంలో వెళ్తుండగా మార్గమధ్యంలో టైరు పేలడంతో వాహనం పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పోశెట్టి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.