ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
KMR: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రాజంపేట్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో సోమవారం తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలకు చీరలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ప్రస్తావించారు.