VIDEO: నిమజ్జనానికి పాటించవలసిన సూచనలు ఇవే..!

HYD: గణేష్ నిమజ్జనానికి పాటించవలసిన ముఖ్య సూచనలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నిమజ్జన ప్రాంతంలో సూచించిన ప్రదేశాల్లో నిమజ్జనం చేయాలని, రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై రంగులు చల్లకూడదన్నారు. విగ్రహాలను అధికారులు నిర్దేశించిన మార్గాల్లోనే నిమజ్జనానికి తీసుకెళ్లాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే పోలీసు సిబ్బందికి తెలపాలని సూచిస్తూ వీడియో విడుదల చేశారు.