పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు సిద్ధం

పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు సిద్ధం

BPT: వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు బుధవారం అమర్తలూరు గ్రామంలో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ప్రారంభంకానున్న ఈ కార్యక్రమంలో మండల ప్రజలు పాల్గొని తమ సమస్యలు, వినతిపత్రాలను ఎమ్మెల్యేకి అందజేయవచ్చని టీడీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. సమస్యల పరిష్కారానికి ఇది మంచి అవకాశం అని క్యాంప్ కార్యాలయం పేర్కొంది.