కార్మికుల ఆర్థిక భద్రతకు చర్యలు: ఫిన్ టెక్
గిగ్ కార్మికులకు పని భవిష్యత్, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఫిన్ టెక్ మైగిగ్ స్టర్స్ ముందుకొచ్చింది. ఈ మేరకు బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ప్రకటించింది. 2030 నాటికి కోటి మంది స్వతంత్ర కార్మికుల ఆర్థిక భద్రతకు చర్యలు తీసుకుంటామని చెప్పింది. దేశంలో ప్రస్తుతం 1.2 కోట్ల గిగ్ కార్మికులు ఉండగా.. ఏటా 17 శాతం వృద్ధితో 2047 నాటికి 62Mకు చేరుకుంటుందని అంచనా వేసింది.