జూన్ 1నుంచి విమాన సర్వీసు ప్రారంభం

SKLM: విజయవాడ - విశాఖపట్నం మధ్య ఉదయపు విమాన సర్వీసులను జూన్ 1వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించనున్నట్టు శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం నగరం నుండి రాజధాని విజయవాడ ప్రాంతం మధ్య విమాన సర్వీస్ తిరిగి ప్రారంభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.