హథీరాంజీ మఠం కూల్చివేత వివాదం

హథీరాంజీ మఠం కూల్చివేత వివాదం

AP: తిరుపతిలోని చారిత్రక హథీరాంజీ మఠం కూల్చివేత వివాదాస్పదమైంది. మఠం భవనం శిథిలావస్థకు చేరిందని, నివాసయోగ్యం కాదని ఐఐటీ నిపుణుల నివేదికలో తేలడంతో అధికారులు ఇవాళ ఆ భవనాన్ని పరిశీలించనున్నారు. అయితే, భక్తులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మఠాన్ని వారసత్వ కట్టడంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.