ఉరివేసుకొని వ్యక్తి మృతి

E.G: ప్రత్తిపాడుకు చెందిన పోలిశెట్టి సుధాకర్(53) ఆదివారం రాత్రి ఉరి వేసుకుని మృతి చెందాడని కిర్లంపూడి ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. కిర్లంపూడి మండలం జగపతినగరం శివారున చింత చెట్టుకు ఉరివేసుకొని మరణించాడన్నారు. మృతుడు టెంట్ హౌస్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు, నాలుగేళ్ల క్రితం భార్యాభర్తల మధ్య గొడవలతో పెద్దల సమక్షంలో విడిపోయారన్నారు . ఒంటరిగా ఉంటూ మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.