యువత ఉపాధికి జాబ్ మేళాలు కీలకం : కలెక్టర్

యువత ఉపాధికి జాబ్ మేళాలు కీలకం : కలెక్టర్

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఈ మేళాలు కీలకమన్నారు. మే 1–24 మధ్య దశలవారీగా జాబ్ మేళాలు నిర్వహించి, ఎంపికైన అభ్యర్థులకు మే 25 లేదా 26న నియామకపత్రాలు అందజేయాలన్నారు. శిక్షణ, ప్రణాళిక, అవగాహన కార్యక్రమాలపై దృష్టి పెట్టానన్నారు.