దారుణం.. లాడ్జిలో తల్లి, కొడుకు ఆత్మహత్య
AP: విశాఖ జిల్లా సింహాచలంలో విషాదం చోటుచేసుకుంది. గాజువాకకు చెందిన తల్లి, కుమారుడు సింహాచలంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుమారుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని పోలీసులు గుర్తించగా.. అతనిపై హైదరాబాద్‌లో 498ఏ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. వీరి బంధువులు ఎవరూ రాకపోవడంతో మృతదేహాలను విశాఖ KGHకు తరలించారు.