VIDEO: 'శాంతిభద్రతల్లో హోంగార్డ్స్ పాత్ర కీలకం'

VIDEO: 'శాంతిభద్రతల్లో హోంగార్డ్స్ పాత్ర కీలకం'

VZM: విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండులో 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన SP దామోదర్ హోంగార్డ్స్ సేవలను అభినందించారు. పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, VIP భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డ్స్ కీలకంగా పనిచేస్తున్నారన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన హోంగార్డ్స్‌కు బహుమతులు అందజేశారు.