నీటిలో పడి యువకుడి మృతి
JGL: ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ శివారులోని సదర్ మార్ట్ ప్రాజెక్ట్ వద్ద చేపలు పడుతూ ప్రమాదవశాత్తు నీటిలోపడి యువకుడు మృతి చెందినట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్‌కు చెందిన పల్లికొండ సిద్దార్థ చేపలుపట్టే సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించినట్లు తండ్రి గంగన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు,.