క్షీరా రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న చీఫ్ ఇంజనీర్

W.G: పాలకొల్లు పంచారామ పుణ్యక్షేత్రం క్షీరరామలింగేశ్వరస్వామి వారి ఆలయాన్ని శనివారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ ఎం.వి.ఆర్.వివేకానందరెడ్డి దర్శించుకున్నారు. ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు సీఈ రెడ్డిని స్వామివారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో డిఈఈలు బీవి రమణ, రాజశేఖర్, రామరాజు పాల్గొన్నారు.