VIDEO: కలెక్టర్ ముందు 16 గ్రామాల ప్రజల ఆవేదన
KRNL: ఆదోని మండల విభజనలో ప్రజల అభిప్రాయం లేకుండా నిర్ణయం తీసుకున్నారని 16 గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆదోని పర్యటనలో ఉన్న కలెక్టర్ డాక్టర్ సిరితో తమ ఆవేదనను వెల్లడించారు. మారుమూల ఉన్న పెద్ద హరివాణం గ్రామాన్ని మండలంగా చేసి 16 గ్రామాలకు అన్యాయం చేశారన్నారు. ఆదోనిని జిల్లా చేయాలని ఆర్&బీ గెస్ట్ హౌస్ కార్యాలయం ముందు బైఠాయించారు.