బాలికపై లైంగిక దాడి.. ఫోక్సో కేసు నమోదు
కడప తాలూకా ఠాణా పరిధిలో మంగళవారం ఫోక్సో కేసు నమోదైందని SI తులసినాగ ప్రసాద్ తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన రెడ్డిబాబు అనే వ్యక్తి తాలూకా పరిధిలో వారి బంధువుల వద్దకు వెళ్లాడు. అదే ప్రాంతానికి చెందిన బాలిక(15)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.