కదిరి నరసింహుడి హుండీ ఆదాయం రూ. 1.17 కోట్లు
సత్యసాయి: కదిరిలోని శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు మంగళవారం జరిగింది. 70 రోజులకుగానూ స్వామివారికి నగదు రూపంలో రూ. 1,17,44,339 కోట్లు ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఈ లెక్కింపులో 23 గ్రాముల బంగారం, 753 గ్రాముల వెండి, అలాగే కొంత విదేశీ కరెన్సీ (24 అమెరికన్ డాలర్లు, 10 కెనడా డాలర్లు సహా) లభించిందని అన్నారు.