చట్టంలో ఉన్న హామీల అమలు ఎప్పుడు?

చట్టంలో ఉన్న హామీల అమలు ఎప్పుడు?

KDP: రాష్ట్ర రాజధాని అమరావతికి పార్లమెంట్ చట్టం ద్వారా చట్టబద్ధత కల్పించడం హర్షణీయమైనప్పటికీ ఇప్పటికే చట్టంలో పొందుపరిచి 11 ఏళ్ళు అయినా అమలుకాని అంశాల మాటేమిటి అని మాజీ MP తులసిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం వేంపల్లిలో ఆయన మాట్లాడారు. సెక్షన్ 94(3) ప్రకారం రాజధానిలో రాజ్ భవన్, సచివాలయం, తదితర మౌలిక వసతులకు కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు.