అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు'

MDK: రేగోడ్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్‌కుమార్ శనివారం తనిఖీ చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు ఎప్పటికప్పుడు సరిపడా లభించేలా, నిల్వలు సక్రమంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధిక ధరలకు ఎరువులు విక్రయించిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జావీద్ పాల్గొన్నారు.