అస్తవ్యస్తంగా నాలాల వ్యవస్థ

అస్తవ్యస్తంగా నాలాల వ్యవస్థ

ఆదిలాబాద్ మండలం అంకోలి గ్రామం హనుమాన్ కాలనీలో డ్రైనేజీలు పూడికతో నిండిపోయాయి. మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఫలితంగా దోమలు, పురుగులు వృద్ధి చెంది అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నాళాలను శుభ్రం చేయించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.