తిరుపతిలో YCP నేతల ధర్నా.. పోలీసుల మోహరింపు
TPT: BR నాయుడు వివాదంపై శాంతియుత ధర్నాలో వైసీపీ మహిళా కార్యకర్తలపై దాడి చేసిన ఘటనను నిరసిస్తూ తిరుపతి RTC బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పెద్దఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.