చెరువును తలపిస్తున్న రైల్వే అండర్ పాస్
BHNG: వర్షాకాలంలో రైల్వే అండర్ పాస్‌ల వల్ల పలు చోట్ల గ్రామస్తుల ఇబ్బందులు తప్పడం లేదు. రామన్నపేట మండలం సిరిపురం వెల్లంకి గ్రామాలకు వెళ్లే దారిలో గల రైల్వే అండర్ వంతెన కింద నిలిచిన నీరు చెరువును తలపిస్తుంది. దీంతో ఇరువైపులా వచ్చిపోయే బైకర్స్ నానా ఇబ్బంది పడుతున్నారు. చాలా రోజులపాటు నిలిచిన నీటిలో వాహనాలు వెళ్ళటం వల్ల దుర్గంధం వస్తుంది.