'ప్రతి విద్యార్థిలో సైంటిస్ట్, ఇంజినీర్'
SDPT: విద్యార్థుల నుంచి గొప్ప గొప్ప ఆలోచనలు రావాలని, ప్రతి విద్యార్థిలో సైంటిస్ట్, ఇంజినీర్ ఉంటాడని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శుక్రవారం బాలికల హైస్కూల్లో జరుగుతున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన తిలకించి మాట్లాడారు. పిల్లల్లో ఉన్న ఆలోచనలకు ఒక రూపం కల్పించేదే సైన్స్ ఫెయిర్ అన్నారు. విద్యార్థుల ప్రదర్శనను వీక్షించి వారిని అభినందించారు.