ఉమ్మడి జిల్లాలో మొదటి విడతకు నామినేషన్‌లు
MBNR: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. సర్పంచ్ ఎన్నికలకు నేటి నుంచి ఈనెల 29 వరకు మొదటి విడత నామినేషన్లు స్వీకరిస్తారు. జిల్లాలోని 1,678 గ్రామపంచాయితీలు, 15,068 వార్డులు ఉన్నాయి. మొత్తం 23,19,178 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 11,49,056, మహిళలు 11,70,079, ఇతరులు 43 మంది ఉన్నారు.