ప్రమాదకర స్థితిలో విద్యుత్ స్తంభం
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం రాజమండ్రి ఇసుక డంపింగ్ యార్డ్ వద్ద విద్యుత్ స్తంభం ఏ క్షణమైనా కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో పక్కనే ఉన్న చెట్టు మీద పిడుగు పడటంతో చెట్టు మొత్తం ఎండిపోయింది. చెట్టు కొద్ది భాగం విద్యుత్ వైర్లపై ఒరగడంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందో అన్న భయంతో కార్మికులు గడుపుతున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.