ఏజెన్సీ పల్లెలకు సీపీఐనే అండ: సాబీర్ పాషా
BDK: ఆళ్లపల్లి ఏజెన్సీ ప్రాంత పల్లెలకు సీపీఐ నిజమైన అండగా నిలిచిందని జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా పేర్కొన్నారు. సోమవారం ఆళ్లపల్లిలో ఆయన మాట్లాడుతూ.. పేదలకు పొడు భూములపై హక్కు సాధించిన ఘనత సీపీఐదేనని తెలిపారు. పెండింగ్ పట్టాల సాధన కోసం పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.