అయినవిల్లి మండలంలో భారీ వర్షం
కోనసీమ: అయినవిల్లి మండలంలోని పలు గ్రామాలలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. దింపు కార్మికులు వారి పనికి అంతరాయం కలిగింది. వాతావరణం చల్లబడడంతో ప్రజలు సేదతీరుతున్నారు.