వేధింపులతో యువతి ఆత్మహత్య

వేధింపులతో యువతి ఆత్మహత్య

ఖమ్మం: కారేపల్లిలో ప్రియుడి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. రేలకాయలపల్లికి చెందిన సందీప్తి (20), RMP నరేశ్‌ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో సందీప్తిని కాలేజీ మాన్పించారు. నరేశ్ సందీప్తిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ గతంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కుటుంబ పరువు పోయిందని భావించిన యువతి పురుగు మందు తాగింది.