రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
JN: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన లింగాల గణపురం మండలంలోని చీటూరు గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భాస్కర్ అనే వ్యక్తి జనగామ నుండి చీటూరు వైపుకు వస్తుండగా ప్రమాదవశాస్తు కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.