'నగర పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరు సహకరించాలి'

'నగర పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరు సహకరించాలి'

MDCL: నగర పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని అల్వాల్ డీసీ భోగేశ్వర్లు కోరారు. సోమవారం అల్వాల్‌లో ఆయన మీడియాకు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. అల్వాల్ సర్కిల్‌లో ఎక్కడైనా చెత్త లేదా వ్యర్థాలు పేరుకుపోయి శుభ్రం చేయాల్సిన అవసరం ఉన్నట్లయితే, సంబంధిత ప్రదేశం ఫొటోతో పాటు గూగుల్ లోకేషన్‌ను పంపిస్తే, మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకుని చెత్తను తొలగిస్తారన్నారు.