సనాతన ధర్మ ప్రబోధన సమితి ఆధ్వర్యంలో సూర్య దేవుని గ్రామోత్సవం

తూర్పు గోదావరి: గోకవరం మండలం తొయ్యూరు ఆర్ అండ్ ఆర్ కాలనీలో సనాతన ధర్మ ప్రబోధన సమితి ప్రధాన కార్యదర్శి అక్షింతల రాజా ప్రోద్బలంతో ఉషా పద్మినీ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి గ్రామోత్సవం నిర్వహించారు. దేవీదేవతల పంచలోహ విగ్రహాలను చేతబట్టి సూర్యదేవుని నామస్మరణతో వీధివీధి ఊరేగింపు నిర్వహించారు. సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తోట సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.