తిరువూరు వైసీపీ మండల అధ్యక్షుడిగా నవీన్

NTR: తిరువూరు పట్టణ పరిధిలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో మండల స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ తిరువూరు మండల అధ్యక్షుడిగా కాకర్ల గ్రామానికి చెందిన తాళ్లూరు నవీన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామాల్లో గ్రూపులు లేకుండా అందరిని ఏకతాటిపై తీసుకురావాలని నవీన్ సూచించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.