ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన డ్రైవర్
ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని పెంచికలపాడు గ్రామ సమీపంలో సోమవారం సాయంతం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొన్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఓ లారీలో ఉన్న డ్రైవర్ అగ్నికి ఆహుతి అయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.