రేపు మచిలీపట్నంలో జగన్ పర్యటన
AP: కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో రేపు(మంగళవారం) మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. అనంతరం పంట నష్టపోయిన రైతులను కలిసి సంఘీభావం తెలుపనున్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.