మున్సిపల్ కార్మికుల ఆందోళన

SKLM: రిటైర్మెంట్, డెత్, సిక్ పోస్టుల ఖాళీల్లో కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం, సీఐటీయూ టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళం కార్పొరేషన్ వద్ద నిరసన చేపట్టారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని, గ్రాట్యూటీ చెల్లించాలని కోరారు.