ఆసరా స్టోర్‌ను ప్రారంభించిన కలెక్టర్ ప్రావిణ్య

HNK: హసన్ పర్తి మండలం వంగపహాడ్ గ్రామంలో నేడు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆసరా స్టోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ.. మహిళలు ఒక గ్రూపుగా ఏర్పడి సామూహికంగా వ్యాపారాలు చేయడానికి ముందుకు వస్తే ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను తదితరులు పాల్గొన్నారు.