27, 28 తేదీల్లో వృక్షశాస్త్ర విభాగంలో జాతీయ సదస్సు

సిద్దిపేట: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 27,28 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు వృక్షశాస్త్ర విభాగాధిపతి సదస్సు కన్వీనర్ డాక్టర్ రాణి తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ సీహెచ్ ప్రసాద్ హాజరై మాట్లాడారు. జాతీయ సదస్సుకు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర కేరళ జార్ఖండ్ రాష్ట్రాల పరిశోధకుల హాజరయ్యారు.