రాష్ట్రస్థాయి రోలర్ స్కేటింగ్ కు అక్క, తమ్ముడు ఎంపిక

రాష్ట్రస్థాయి రోలర్ స్కేటింగ్ కు అక్క, తమ్ముడు ఎంపిక

అన్నమయ్య: రాజంపేటలోని ఓపాఠశాలలో చదువుతున్న అక్కా,తమ్ముడు రాష్ట్రస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలకు ఎంపికయ్యారు. కడప మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో 1వ తరగతి చదువుతున్న సగిలి రావణ రింగ్ రేస్-1,2 లో 2గోల్డ్ మెడల్ సాధించాడు. అక్క సంఘమిత్ర రింగ్ రేస్-1లో రజిత పథకం సాధించింది. కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు వీరు ఎంపికయ్యారని టీచర్లు తెలిపారు.