VIDEO: భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

KMM: జిల్లాలో శనివారం మధ్యాహం వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి పొడి వాతావరణం ఉండగా.. మధ్యాహ్నం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో డ్రైనేజీ కాలువలు పొంగిపోయాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అటు డ్రైనేజీ వాటర్ రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.