మీరు వెళ్లే బస్సు బాగుందా లేదా.. ?
ప్రకాశం: వరుస ప్రమాదాల నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీ బస్సుల పనితీరుపైనా ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో చాలా బస్సులపై కేసులు నమోదు చేశారు. దీంతో శనివారం సంతనూతలపాడు పోలీసులు ప్రైవేట్ స్కూల్ బస్సులను చెక్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ కిట్, అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా లేదా అని తనిఖీ చేసారు.