'మహిళలు బలోపేతం కావాలి'
ప్రకాశం: డ్వాక్రా మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఓటమి ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం సింగరాయకొండలో డ్వాక్రా మహిళలకు మెగా రుణమేళా యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి స్వామి మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళలు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.