పాఠశాలలో విద్యార్థులకు మాక్ పోలింగ్

పాఠశాలలో విద్యార్థులకు మాక్ పోలింగ్

JGL: కథలాపూర్ మండలం పోతారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు. విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. సర్పంచ్ ధర్మపురి స్వప్న, ఏఎంసీ వైస్ ఛైర్ పర్సన్ పులి శిరీష, హెచ్ఎం శ్రీనివాస్, కార్యదర్శి రాజేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.