'ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు ఆర్థికాభివృద్ధి'
GDWL: ఆయిల్ ఫామ్ సాగు ద్వారా రైతులు ఆర్థికాభివృద్ధి చెందేందుకు మంచి అవకాశం ఉందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అక్బర్ తెలిపారు. అయిజలోని రైతు వేదికలో విండో ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఏవో జనార్దన్‌లతో కలిసి ఆయన మంగళవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయిల్ ఫామ్ సాగు వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని అక్బర్ పేర్కొన్నారు.