ఆపరేషన్ సింధూర్ అభినందనీయం: తులసిరెడ్డి

ఆపరేషన్ సింధూర్ అభినందనీయం: తులసిరెడ్డి

KDP: భారత రక్షణ దళాలు 'ఆపరేషన్ సింధూర్ 'ను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని మాజీ ఎంపీ తులసి రెడ్డి కొనియాడారు. గురువారం వేంపల్లిలోని ఆయన కార్యాలయంలో మాట్లాడారు. పాకిస్థాన్‌లోని నాలుగు పాక్ ఆక్రమిత, POKలోని ఐదు ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయడం సాహసోపేతమని అన్నారు. పాక్ పౌరుల మీద దాడి చేయకుండా ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేయడం మన రక్షణదళాల సామర్థ్యం అన్నారు.