మహానందిలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ పూజలు
NDL: మహానందిలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ వెంకటేశ్వర్లు కుటుంబీకులతో కలిసి పూజలు నిర్వహించారు. శ్రీ మహానందీశ్వర స్వామి దర్శనార్థం వచ్చిన వారికి ఏఈవో మధు, ఇన్‌స్పెక్టర్ నాగమల్లయ్య స్వాగతం పలికారు. శ్రీ కామేశ్వరి దేవి, శ్రీ మహానందీశ్వర స్వామివారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేశారు. దర్శనం అనంతరం వారికి అమ్మవారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు.