మీడియా సెంటర్, ఎంసీఎంసీ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

మీడియా సెంటర్, ఎంసీఎంసీ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

NZB: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) సెల్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. ఎంసీఎంసీ ద్వారా చేపడుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.