VIDEO: కత్తులతో దాడి చేసుకున్న జనసేన నేతలు
KKD: జనసేన నేతలు కత్తులతో దాడి చేసుకున్న ఘటన పిఠాపురంలో జరిగింది. బి.ప్రత్తిపాడులో డ్రైనేజీ విషయంలో ఊటా రాంబాబు, ఊటా శ్రీను మధ్య ఘర్షణ తలెత్తింది. 10 రోజుల క్రితం రాంబాబు ఇంటి ముందు డ్రైనేజీ వద్దని అడ్డుకోగా, శ్రీను చేయి చేసుకున్నాడు. దీనిపై నిన్న కత్తులతో దాడిచేసుకోగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.