VIDEO: 'బీటీ రోడ్డును వెంటనే మంజూరు చేయాలి'
BHPL: చిట్యాల మండల కేంద్రంలోని ఏలేటి రామయ్యపల్లి నుంచి కైలాపూర్ వెళ్లే మట్టి రోడ్డు ఇటీవలి వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు త్వరగా స్పందించి బీటీ రోడ్డు మంజూరు చేయాలని శనివారం గ్రామస్తులు కోరారు.