స్పందనలో వినతులకు స్పందించిన అధికారులు
ASR: అరకులోయ మండలం, బస్కి పంచాయితీ గుగ్గుడు, మొర్రిగుడ, కొంత్రాయిగుడ, కొర్రగుడ గ్రామాల రైతులు కొండపోడు పట్టాల కోసం గిరిజన సంఘం ఆధ్వర్యంలో స్పందనలో పెట్టిన వినతులకి ప్రభుత్వం స్పందించింది. గురువారం రెవెన్యూ అధికారులు సర్వేయర్‌ను పంపించి పోడు పట్టాలకు ధరఖాస్తు చేసిన గ్రామాలలో సర్వే చేయించారు. వినతులకు స్పందించిన అధికారులకు రైతులు ధన్యవాదాలు తెలిపారు.